India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచగా, కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడుపోయాయి. దాయాదుల పొరుకి భారీ డిమాండ్ ఉండటంతో కొద్ది మందికి మాత్రమే టికెట్లు దొరికాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆడే ఇతర మ్యాచ్‌ల టికెట్లు కూడా మొత్తం అమ్ముడుపోవడం గమనార్హం.
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే… దానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో, కేవలం ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్‌లోనే ఈ జట్లు మ్యాచ్ ఆడతాయి. దీని వల్ల వీటికి మరీ భారీ డిమాండ్ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ మ్యాచ్ జరిగితే, స్టేడియం నిండిపోవాల్సిందే. గత టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే జరిగింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్య దేశం అయినప్పటికీ, భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో భారత్ తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంటుంది. లీగ్ దశ ముగింపులో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
India vs Pakistan: ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సాధారణ స్టాండ్ టికెట్ల ధర భారత కరెన్సీలో రూ.2,965 అని నిర్ణయించారు. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగడంతో, టికెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఇది కూడా చదవండి:Uttar Pradesh: బస్సును ఢీ కొట్టిన మహాకుంభమేళా నుంచి వస్తున్న జీపు.. ఇద్దరి మృతి.. 10 మందికి గాయాలు
ఈ మ్యాచ్ దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది, దీని సామర్థ్యం 25,000 మంది. అయితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల కోసం సుమారు 1,50,000 మంది ఒకేసారి ఆన్‌లైన్‌లో ప్రయత్నించారు. వారిలో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే టికెట్ దక్కినట్లు తెలుస్తోంది. గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
ఇక్కడ ఎలాంటి బ్లాక్ లో అమ్ముడుపోవడం, నిర్వాహకుల కోసం స్పెషల్ టిక్కెట్లు వంటివి ఏవి ఉండవు. కచ్చితంగా ప్రతి ఒక్క టికెట్ ను ఆన్లైన్ లోనే ఉంచుతారు, అక్కడి నుండే విక్రయిస్తారు. ఇక అభిమానులు ఎప్పుడు మొదలవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఈ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. టోర్నీ లో మొత్తం 8 దేశాలు పాల్గొనే అవకాశం ఉండగా, వారంతా తమ జట్లను ప్రకటించారు. అవసరమైతే జట్లలో మార్పులు, చేర్పులు ఫిబ్రవరి 11 వరకు చేయవచ్చు.

