india vs pakistan:

india vs pakistan: భార‌త్ ఎదురుదాడితో గ‌జ‌గ‌జ వ‌ణికిన పాక్‌.. ప‌రారీలో పాక్ ప్ర‌ధాని

india vs pakistan: ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో భార‌త సైన్యం చేప‌ట్టిన దాడుల‌తో పాకిస్తాన్ గ‌జ‌గ‌జా వ‌ణుకుతోంది. బుధ‌, గురువారాల్లో భార‌త్ స‌రిహ‌ద్దుల్లోని ప్రాంతాల్లో పాకిస్తాన్ విచ‌క్ష‌ణార‌హితంగా దాడుల‌కు దిగింది. ఈ దాడుల‌ను భార‌త సైన్యం తిప్పికొట్టింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌కు చెందిన 8 డ్రోన్లు, 3 ఎఫ్ జెట్‌ల‌ను భార‌త సైన్యం కూల్చివేసింది. ఈ స‌మ‌యంలోనే పాకిస్తాన్ పైలెట్ భార‌త సైన్యానికి బందీగా చిక్కాడు. అత‌ను ఎఫ్ జెట్ పైలెట్‌గా భావిస్తున్నారు. భార‌త్ ఎదురుదాడుల్లో ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌హ‌బాబ‌జ్ ష‌రీఫ్ ఇంటి స‌మీపంలో బాంబు దాడుల‌కు దిగింది. దీంతో పాక్ ప్ర‌ధాని అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం.

india vs pakistan: భారత త్రివిధ ద‌ళాల వ‌రుస దాడుల‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ది. తొలుత పాకిస్తాన్ జ‌మ్ము, ప‌ఠాన్‌కోట్‌, ఉధంపూర్‌ల‌లో దాడుల‌కు దిగింది. ఈ స‌మ‌యంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్ల‌ను భార‌త సైన్యం ధ్వంసం చేసింది. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాల‌ను భార‌త సైన్యం ఆకాశంలోనే కూల్చేసింది. గురువారం అర్ధ‌రాత్రి భార‌త సైన్యం పాక్‌లోని లాహోర్‌, ఇస్లామాబాద్‌, సియోల్‌కోట్‌, కరాజీపై మిస్సైళ్ల‌తో దాడికి దిగింది. ఈ దాడుల‌తోనే భ‌య‌ప‌డిన ఆ దేశ ప్ర‌ధాని త‌న ఇల్లు వ‌దిలి ఓ బంక‌ర్‌లో త‌ల‌దాచుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

india vs pakistan: ఇదే స‌మ‌యంలో జ‌మ్ము క‌శ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పాకిస్తాన్ సైనికులు భార‌త భూభాగంలోకి చొర‌బాటుకు య‌త్నించారు. అయితే పాక్ ఈ చొర‌బాటు య‌త్నాల‌ను భార‌త సైన్యం భ‌గ్నం చేసింది. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన జ‌మ్ముక‌శ్మీర్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, గుజ‌రాత్ లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అదే విధంగా ఢిల్లీ, హ‌ర్యానా, బెంగాల్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

india vs pakistan: గుజ‌రాత్ స‌ముద్ర‌తీరం వెంట భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. స‌రిహ‌ద్దు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచ‌న‌లు చేశారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని సైన్యం చెప్పింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లోని టెర్మిన‌ళ్ల‌లో సంద‌ర్శ‌కుల అనుమ‌తిపై నిషేధం విధించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Zelensky: భారత్‌పై ఆంక్షలు విధించడంలో తప్పులేదు.. ట్రంప్ కి ఉక్రెయిన్ అధ్యక్షుడు సపోర్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *