India vs Japan Hockey: ఎదురేలేకుండా మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో దూసుకుపోతున్న భారత్ నాకౌట్ సవాల్‌కు రెడీ అంటోంది. లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా ముందుకు సాగిన సలీమా సేన సెమీస్ లో జపాన్ ను ఢీకొడుతోంది. భారత్ అటు ఎటాకింగ్ ఇటు డిఫెన్స్‌లో బలంగా ఉందంటున్న కోచ్ హరేంద్ర సెమీస్ లోనూ మాదే విక్టరీ అంటున్నాడు.
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో సెమీ ఫైనల్లో జపాన్ తో భారత జట్టు తలపడనుంది. ప్రస్తుతం అదిరే ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ లీగ్ దశలో అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇలాంటి భీకర ఫాంలో ఉన్న భారత్ ను నిలువరించడం జపాన్‌కు తేలికేం కాదు. లీగ్ దశలో అయిదు మ్యాచ్‌లు ఆడి అన్నీ గెలిచిన భారత్… ఈ క్రమంలో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విన్నర్ చైనాను 3-0తో కంగుతినిపించడం అంటే భారత్ ఏ స్థాయిలో చెలరేగుతుందో ..ఎలాంటి ఫాంలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: BGT Series: బీజీటీ సిరీస్ ముంగిట అయోమయం.. కంగారులో టీమిండియా
కొత్త కోచ్ హరేంద్ర సింగ్ నేతృత్వంలో దూకుడు మీదున్న భారత్‌కు.. ఒక్క విషయంలో బలహీనత కనిపిస్తోంది. అదే పెనాల్టీకార్నర్లను గోల్స్ గా మలచడం.. లీగ్ దశలో పెనాల్టీ కార్నర్ లను సాధించినా వాటిని గోల్స్ గా మలచడంలో మన ఆటతీరు పేలవంగా ఉంది. లీగ్ దశలో చాలా పీసీలను వృథా చేసిన సలీమా బృందం.. సెమీస్‌లో అలాంటి తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫీల్డ్ గోల్స్ సాధనంలో స్టార్ స్ట్రైకర్ దీపిక, సీనియర్ ప్లేయర్ షర్మిలాదేవి, సంగీత కుమారి, ప్రీతి దూబె అద్భుత ఫాంతో జోరుమీదుండడంతో భారత్ సెమీస్ బరిలోకి ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అంతేకాదు లీగ్ దశలో జపాన్ ను మన అమ్మాయిలు చిత్తుగా ఓడించారు. సూపర్ ఫెర్పార్మెన్స్, అద్భుతమైన టీం కాంబినేషన్ వెరసి భారత్ ఫైనల్ చేరడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు.