IND vs AUS: మొదట తడబడ్డారు. తరువాత పడగొట్టారు. ఆపైన నిలబడ్డారు. చివరికి చుక్కలు చూపించారు. సింపుల్ గా ఇదీ పెర్త్ టెస్ట్ లో భారత జట్టు ప్రదర్శన గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకోవాలంటే. వంద పరుగులు చేయడానికి కష్టపడ్డారు.. మొత్తమ్మీద పడుతూ లేస్తూ 150 పరుగులు చేశారు. అబ్బో ఈ స్కోరు చాలదు. ఆస్ట్రేలియాకు ఇది జుజుబీ స్కోర్.. అని అంతా అనుకున్నారు. కానీ, భారత బౌలర్లు అద్భుతం చేశారు. కంగారూలను బెంబేలెత్తించారు. వంద పరుగులు చేస్తే ఎక్కువ అన్నట్టుగా ఆసీస్ బ్యాటర్ల పరిస్థితి తయారైంది. దీంతో 104 పరుగులకు ఆస్ట్రేలియాను కట్టడి చేసి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది భారత్. తరువాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత బ్యాటర్లు.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పంత్, కోహ్లీలు సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాకు గట్టి సవాలు విసిరారు. దీంతో భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఒత్తిడికి నిలబడలేకపోయారు. భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడటమే కాదు.. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో తమ సొంత గడ్డపై భంగపడ్డారు.
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.
ఇది కూడా చదవండి : IPL Auction 2025: ఐపీఎల్ లో పంత్.. శ్రేయాస్ రికార్డ్.. ఏకంగా అన్ని కోట్లు ఇచ్చిన ఫ్రాంచైజీలు
IND vs AUS: పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నాలుగో రోజు 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకు ఆలౌటైంది. తరువాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 104 పరుగులకు కట్టడి చేసింది.
IND vs AUS: పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఇంతకు ముందు ఆ జట్టు 4 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, మహ్మద్ సిరాజ్ 3-3 వికెట్లు తీశారు. ట్రావిస్ హెడ్ (89) అర్ధ సెంచరీతో రాణించాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏
A dominating performance by #TeamIndia to seal a 295-run victory in Perth to take a 1-0 lead in the series! 💪 💪
This is India’s biggest Test win (by runs) in Australia. 🔝
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo#AUSvIND pic.twitter.com/Kx0Hv79dOU
— BCCI (@BCCI) November 25, 2024
రెండు జట్లలో ప్లేయింగ్-11
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా మరియు మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ మరియు నాథన్ లియాన్.