DSP

DSP: మనసులో బాధ వెళ్లగక్కిన డీఎస్పీ

DSP:  ‘పుష్ప -2’ సినిమా ఐటమ్ సాంగ్ ఆవిష్కరణ సమయంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతల పట్ల మనసులోని అసంతృప్తిని వెళ్ళగక్కేశారు. ”మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి. అది నిర్మాతల నుండి రావాల్సిన రెమ్యూనరేషన్ అయినా… టైటిల్ కార్డ్స్ లో క్రెడిట్ అయినా” అని చెప్పారు. ఈ మధ్య పుష్ప -2 సినిమా రీ-రికార్డింగ్ దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా వేరే సంగీత దర్శకులతో చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Kissik Song: ‘పుష్ప 2’ స్పెషల్‌ సాంగ్‌.. ‘కిస్సిక్‌’ వచ్చేసింది

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకపోయినా… ఆ మధ్య తమన్… తను, తనతో పాటు కొందరు సంగీత దర్శకులు ఈ సినిమాకు రీ-రికార్డింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్ర నిర్మాతలు తాను సమయానికి అవుట్ పుట్ ఇవ్వనని విమర్శిస్తుంటారని కానీ అది వాస్తవం కాదని, ఈ వేడుకకూ సమయానికే వచ్చిన బయట చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చిందని వేదిక మీదనే తెలిపారు. మొత్తం మీద పరోక్షంగా తనపై వస్తున్న ఆరోపణలకు దేవిశ్రీ ప్రసాద్ తన స్పీచ్ లో వివరణ ఇచ్చే  ప్రయత్నం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Virat Kohli: అతనో అద్భుతం కోహ్లీకి ఆసీస్ స్పిన్నర్ లైయన్ కితాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *