Supreme Court: శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి తనకు భారత్‌లో శరణం కల్పించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సందర్భంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం (ధర్మశాల) కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులను శాశ్వతంగా ఆశ్రయించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
2015లో తమిళనాడులో శ్రీలంక దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ (LTTE)తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 2018లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఆ శిక్షపై మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా, శిక్షను 7 సంవత్సరాలకు తగ్గిస్తూ 2022లో తీర్పు ఇచ్చింది. అయితే శిక్ష పూర్తయిన వెంటనే భారత్‌ను విడిచిపెట్టాలని, శ్రీలంక వెళ్లే వరకు శరణార్థుల శిబిరంలో ఉండాలని ఆదేశించింది.
శిక్ష పూర్తైన తర్వాత వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్ధమైన వీసాతో భారత్‌కి వచ్చానని, తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఉందని, తన భార్యా పిల్లలు భారత్‌లోనే ఉన్నారని తెలిపాడు. అందువల్ల తనకు ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు.
Also Read: Operation Sindoor: ఇండియన్ ఆర్మీ దెబ్బకు వణుకిపోతున్న పాక్.. ఈ 5 విషయాలు మరచిపోదేమో
ధర్మాసనం స్పందన:
ఈ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు పేర్కొన్నది: “భారత్ ప్రపంచం నలుమూలల శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే ధర్మశాల కాదు. దేశ జనాభా ఇప్పటికే అధికంగా ఉంది. విదేశీయులెవరికైనా ఇక్కడ స్థిరపడే హక్కు ఉండదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.”
Supreme Court: పిటిషనర్ తరఫున న్యాయవాది Article 21 (జీవించే హక్కు), Article 19 (ప్రజాప్రాముఖ్యత హక్కులు) ఆధారంగా వాదించగా, ధర్మాసనం Article 19 కేవలం భారతీయ పౌరులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కోర్టు చివరకు పిటిషన్‌ను తిరస్కరించింది. శ్రీలంకలో ప్రాణహాని ఉంటే ఇంకొక దేశాన్ని ఆశ్రయించుకోవాలని సూచించింది. భారత్‌లో శాశ్వతంగా ఉండటానికి పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది.

