India-EFTA: భారత్, 4 ఐరోపా దేశాల కూటమి-EFTA మధ్య కుదిరిన.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని…… కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల…… రాబోయే 15 ఏళ్లలో దేశంలోకి దాదాపు 8.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఇందువల్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టికి…. అవకాశం ఉంటుందని వివరించారు. మరో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా…… ఆస్కారం ఉందని చెప్పారు. భారత్ , ఈఎఫ్ టీఏ దేశాల మధ్య కుదిరిన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం పదేళ్ల పాటు స్విస్ వాచీలు, చాక్లెట్లు, బిస్కెట్లు, వజ్రాలపై….. దిగుమతి సుంకం ఉండదని పీయూష్ వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక… పదేళ్లలో భారత్ లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని..EFTA దేశాలు పేర్కొన్నాయి. ఏదైనా కారణం చేత పెట్టుబడులు పెట్టకపోతే…… ఆయా దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించేలా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐస్ ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లీచ్ టెన్ స్టైన్ దేశాలు ఈఎఫ్ టీఏలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
