Unstoppable with NBK: అటు బాలయ్య, ఇటు బన్నీ ఇద్దరూ తమ తమ సినిమాల షూటింగ్స్ తో బిజీ ఉన్నారు. వీరిలో బన్నీ సినిమా ‘పుష్ప2’ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా, బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి రాబోతున్నాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ‘ఆహా’ వారి అన్ స్టాపబుల్ సీజన్ 4 తో కూడా సందడి చేస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. ఒకదానిని మించి మరోటి అన్నట్లు వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్న ఈ సీజన్ లో తదుపరి ఎపిసోడ్ బన్నీతో చేసిందే టెలీకాస్ట్ కానుందట.
ఇది కూడా చదవండి: Kajal Aggarwal: అతనే నా క్రష్.. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది
Unstoppable with NBK: ఇటీవల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ను నవంబర్ 15న టెలికాస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎసిసోడ్ లో బన్నీ తన ‘పుష్ప2’ యూనిట్ తో సందడి చేశాడు. ఇక ఇందులోనే అల్లు అయాన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. మరి ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు సంధించాడు? వాటికి బన్నీ ఏమి ఆన్సర్ ఇచ్చాడు? అన్నది త్వరలో రిలీజ్ కాబోతున్న ప్రోమో చూస్తే కానీ తెలియదు. అయితే అందరూ మాత్రం ఎదురు చూస్తున్నది బాలకృష్ణ అల్లు అర్జున్ ని నంధ్యాల ఎపిసోడ్ గురించి అడిగాడా? లేదా? అన్నదే. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.