Ap News

AP News: ఏపీలో గర్భిణీ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై దారుణ దాడి – మద్యం మత్తులో రెచ్చిపోయిన దుండగులు

AP News: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఆదివారం అర్థరాత్రి దారుణం జరిగింది. ఐదో నెల గర్భంతో ఉన్న మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత, ఆమె భర్త ఆనంద్‌పై కొందరు దుండగులు కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దంపతులు ఇద్దరూ విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఆదివారం రాత్రి విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ వ్యక్తి ఢీకొట్టాడు. గర్భవతైన సునీత బైక్‌ దిగడంతో, ఆమె భర్త ఆనంద్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సునీత చెప్పుతో కొట్టింది.

ఈ ఘటనతో రెచ్చిపోయిన ఆ దుండగుడు వెంటనే 10 మంది రౌడీ గ్యాంగును పిలిపించి, దంపతులపై విచక్షణారహితంగా దాడి చేయించాడు. “నా భార్య గర్భవతి, దయచేసి వదిలేయండి” అని భర్త ప్రార్థించినా, దుండగులు వినిపించుకోకుండా బండరాళ్లతో దాడికి దిగినట్లు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: CM Chandrababu: సాధనల దిశగా స్వర్ణాంధ్ర ప్రయాణం: సీఎం చంద్రబాబు

AP News: ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన చూసి తమను కాపాడేందుకు వచ్చిన కొంతమంది స్థానికులను కూడా దుండగులు బెదిరించారట. “మీరు మాకు అడ్డు తగిలితే చంపేస్తాం” అని హెచ్చరించినట్లు బాధిత మహిళ తెలిపింది.

ఒక గర్భిణీ పోలీస్ అధికారిణిపై ఈ తరహా దాడి జరగడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయంలో పోలీసుల సహాయం లేకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gujarat: రూ.1.07 కోట్ల చోరీ దొంగలను పాటించిన పోలీస్ జాగిలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *