Ee Nagaraniki Emaindi 2: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మెస్మరైజ్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్‌లో కల్ట్ ఫీవర్ సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి రిలీజ్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు సీక్వెల్‌తో మరో బ్లాక్‌బస్టర్ రైడ్‌కు రెడీ అవుతోంది! తరుణ్ భాస్కర్ తన లాప్‌టాప్‌లో ‘ది ఎండ్’ అనే టైటిల్‌తో ఫోటో షేర్ చేసి, ‘ఈ నగరానికి ఏమైంది 2’ స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు హింట్ ఇచ్చారు.
Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ మరాణ మాస్ ప్రయోగం!
Ee Nagaraniki Emaindi 2: ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఫ్యాన్స్ మొదటి భాగం లాంటి ఎమోషనల్ డెప్త్, యూత్‌ఫుల్ ఎనర్జీ, ఫన్ వైబ్‌ను ఈ సీక్వెల్‌లోనూ ఆశిస్తున్నారు. తరుణ్-విశ్వక్ కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయనుందని అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం యూత్ ఆతృతగా వెయిట్ చేస్తోంది. ఈ సీక్వెల్ కచ్చితంగా టాలీవుడ్‌లో మరో ట్రెండ్ సెట్ చేస్తుందనడంలో డౌట్ లేదు!