Rain Alert: ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా తూర్పు తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇదే సమయంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది.ఈ రెండు ద్రోణుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
