Ramayana: రామాయణం సినిమా రెండు భాగాలుగా 2026, 2027 దీపావళికి విడుదల కానుంది. రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఐమాక్స్‌లో భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో ఈ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని ఐమాక్స్ సీఈవో రిచర్డ్ గెల్ఫాండ్ అంచనా వేశారు.

