Ajith Kumar: సౌత్ సినిమా సంగీత దిగ్గజం ఇళయరాజా గీతాలు ఆణిముత్యాలు. ఆయన ట్యూన్స్‌ను యువ దర్శకులు తమ సినిమాల్లో ఉపయోగించి అభిమానం చాటుతున్నారు. కానీ, అనుమతి లేకుండా వాడితే చిక్కులు తప్పవు.తాజాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో ఇళయరాజా ట్యూన్‌ను అనధికారికంగా వాడటంతో చిత్ర బృందం కోర్టు కేసుల గుండీలో చిక్కుకుంది. ఇళయరాజా ఏకంగా 5 కోట్ల రూపాయల క్లెయిమ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు.
Also Read: Akhanda 2: అఖండ 2 కి నలుగురు ఊరమాస్ ఫైట్ మాస్టర్స్!
Ajith Kumar: ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ గీత గొడవ మధ్యలోనూ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. యూత్‌ను ఆకట్టుకుంటూ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మేకర్స్ ఈ సంగీత వివాదాన్ని ఎలా సమర్థవంతంగా పరిష్కరిస్తారనేది ఆసక్తికరం. ఇళయరాజా స్టాండ్‌తో కాపీరైట్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

