IIFA-2024

IIFA-2024: చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. గోల్డెన్ లెగసీగా బాలకృష్ణ.. ఒకే వేదికపై ఇద్దరికీ!

చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే IIFA అవార్డుల వేడుక (IIFA-2024) అబుదాబిలో జరిగింది. రెండో రోజు ఈవెంట్ లో సినిమాలకు సంబంధించి పలు అవార్డులు ప్రకటించి, అందచేశారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును చిరంజీవికి అందచేశారు. అదేవిధంగా ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సమంతకు ఇచ్చారు. తెలుగు సినిమాకి సంబంధించి నానికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు ఇచ్చారు. చిరంజీవికి అవార్డు ఇస్తున్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు .  

IIFA-2024 అవార్డుల లిస్ట్ ఇదే . . 

అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా: చిరంజీవి

అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ ఇండియన్ సినిమా  – ప్రియదర్శన్

ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – సమంత

గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణ

ఎక్సెప్షనల్ ఎక్సలెన్స్ (కన్నడ) – రిషబ్ శెట్టి

ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్

ఉత్తమ నటుడు (తెలుగు) – నాని

ఉత్తమ నటుడు (తమిళం) – విక్రమ్ (పొన్నిన్‌సెల్వన్ 2)

ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్య రాయ్ (పొన్నియిన్‌సెల్వన్ 2)

ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నిన్‌సెల్వన్ 2)

ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – AR రెహమాన్ (పొన్నియిన్‌సెల్వన్ 2)

ఉత్తమ విలన్ (తమిళం) – SJ సూర్య (మార్క్ ఆంటోని)

ఉత్తమ విలన్ (తెలుగు) – షైన్ టామ్ (దసరా)

ఉత్తమ విలన్ (కన్నడ) – జగపతి బాబు

ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పొన్నియిన్‌సెల్వన్ 2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

ఉత్తమ సాహిత్యం: జైలర్ (హుకుమ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: చిన్నంజీరు (పొన్నిన్‌సెల్వన్ 2)

ఉత్తమ నేపథ్య గాయని: శక్తిశ్రీ గోపాలన్ (పొన్నింసెల్వన్ 2)

ఉత్తమ విలన్ (మలయాళం): అర్జున్ రాధాకృష్ణన్

బాలక్రిష్ణ అవార్డు అందుకుంటున్న వీడియో ఇక్కడ చూడొచ్చు . . 

ఇది కూడా చదవండి :  దేవ..రా! NTR సినిమా ఇది!! 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *