Face Pack: చాలా మంది తమ ముఖాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఖరీదైన క్రీములు, ఆయిల్స్‌ను ముఖాలకు రాస్తుంటారు. కానీ అవి డబ్బు వృధా చేయడమే అవుతుంది. ఒక వారం పాటు జెల్ అప్లై చేస్తే, మీ అందం రెట్టింపు అవుతుంది. చాలా మంది తమ జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేసుకోవడానికి మందార పువ్వులు, ఆకులను ఉపయోగిస్తారు. ముఖాలను అందంగా మార్చుకోవడానికి సైతం ఈ మందార పువ్వులను ఉపయోగించవచ్చు. కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
తాజాగా కోసిన పది మందార పువ్వులను తీసుకోవాలి. ఒక పాత్రలో అర లీటరు నీళ్లు పోసి మరిగించాలి. నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత, మందార పువ్వులను నీటిలో కలపాలి. మంట తగ్గించి, మందార పువ్వులను 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని తీసి వేరే పాత్రలో వేయాలి. ఇది జెల్ రూపంలోకి మారుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ మందార పూల జెల్‌ను ముఖం మీద మాత్రమే కాకుండా చేతులు, కాళ్ళపై నల్లటి ప్రదేశాలలో కూడా రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చాక అది ముఖానికి పేస్ట్ లాగా అంటుకుంటుంది.
ఇది కూడా చదవండి: Rice: మూడు పూటలు అన్నం తింటే ఇప్పుడే మానేయండి!
అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మురికి తొలగిపోయి.. కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఈ రెసిపీని స్నానానికి ముందు వరుసగా ఏడు రోజులు చేస్తే ముఖం 7 రోజుల్లో హీరోయిన్ లాగా మెరిసిపోతుంది.ఈ మందార పూల జెల్‌ని ముల్తానీ మట్టిని జోడించొచ్చు. ఇలా చేసినా ముఖం మీద ఉన్న మృతకణాలు అన్నీ పోయి..ముఖం మెరుస్తుంది. మందార, గులాబీ రేకుల మిశ్రమం చర్మాన్ని ఎండ నుండి రక్షిస్తుంది. చర్మ నష్టాన్ని నివారిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ని రోజూ వాడటం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.
మందారం ఉపయోగాలు :
మందారంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన, స్పష్టమైన చర్మాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. దీంట్లో జింక్ కూడా ఉంటుంది.. ఇది మూసుకుపోయిన రంధ్రాలను కుదించడం ద్వారా మొటిమలను నివారిస్తుంది.