Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీ సాధనకు శ్రమిస్తున్నాడు. ఇటీవల జిమ్ నుంచి వచ్చిన ఓ ఫోటో కూడా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు రేకెత్తిస్తోంది. దీపికా పదుకోణ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ సైలెంట్‌గా సాగుతున్న నేపథ్యంలో బన్నీ జిమ్‌లో కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల ఆయన ఫోన్ వాల్‌పేపర్‌లో కనిపించిన ఫిజిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం స్టన్నింగ్ ఫిజిక్ సాధనలో బన్నీ ఉన్నట్టు సమాచారం. దేశ ముదురు సినిమా తరువాత బన్నీ మరోసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

