IBoMMA Ravi Case: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఇమ్మడి రవి (iBOMMA ) అరెస్టు అనంతర పరిణామాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఆయనపై కేసు మరింతగా బిగుసుకుంటున్నది. ఇప్పటికే ఆయనపై వివిధ సెక్షన్ల కింద 10 కఠినమైన కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఫోర్జరీ సెక్షన్ను చేర్చడం మరో కీలకాశం.
IBoMMA Ravi Case: ఇమ్మడి రవి కేసును కేవలం పైరసీ కేసుగానే కాకుండా, ఆర్థిక నేరాలపైనా విచారణ కొనసాగుతున్నది. ఈ దశలో ఇమ్మడి రవి తరఫున కోర్టులో ఉచితంగా వాదించేందుకు సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. రిమాండ్లో ఉన్న రవిని బెయిల్పై బయటకు తీసుకొస్తానని, ఆయన తరఫున తాను వాదిస్తానంటూ చెప్పుకొచ్చారు.
IBoMMA Ravi Case: అయితే విశాఖ జిల్లాలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును అడ్వకేట్ సలీమ్ స్వయంగా కలిశారు. రవి తరఫున తాను వాదించేందుకు తండ్రిగా సంతకాలు చేయాలని ఆయనను కోరారు. అయితే దీనికి అప్పారావు నిరాకరించారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని, వయసు రీత్యా కూడా తాను కోర్టుల చుట్టూ తిరగలేనని.. పేర్కొంటూ సంతకం చేసేందుకు నిరాకరించారు.
IBoMMA Ravi Case: ఇదిలా ఉండగా, ఐ బొమ్మ రవి కస్టడీకి తాజాగా నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల అరెస్టు చేసిన రవిని వారం రోజులపాటు కస్టడీ ఇవ్వాలని కోర్టులో దాఖలైన పిటిషన్పై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐ బొమ్మ రవి కేసు ఎటు మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి పెట్టిందని తెలుస్తున్నది.

