Hydra: హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలు సోమవారం నుంచి నిలిచిపోయాయి. హైడ్రా మార్షల్స్ విధులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. 51 హైడ్రా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే తాము విధులను బహిష్కరించామని హైడ్రా మార్షల్స్ ప్రకటించారు.
Hydra: హైడ్రా ఉద్యోగులు, సిబ్బందికి రూ.7,000 జీతం చొప్పున తగ్గిస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో హైడ్రా ఉద్యోగులు భగ్గుమన్నారు. ఎమర్జెన్సీ సేవలు, సమయానికి మించి సేవలందిస్తున్న తమకు జీతాలు తగ్గించడమేమిటని ఆందోళన చెందుతున్నారు. ఏకంగా విధులను బహిష్కరించడంతో ఎక్కడికక్కడ పనులు బంద్ అయ్యాయి.
Hydra: వర్షాలు, వరదల సమయంలో హైడ్రా ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పలువురి నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారని, వచ్చాక వేతనాల విషయమై చర్చిస్తామని, అప్పటి వరకు విధుల్లోకి రావాల్సిందిగా హైడ్రా ఉన్నతాధికారులు సూచించారు. కానీ, ఉద్యోగులు మాత్రం ససేమిరా అన్నట్టు తెలిసింది.

