Hydra:

Hydra: అల్వాల్‌లో హైడ్రా కూల్చివేత‌లు.. బాధితుల ల‌బోదిబో

Hydra:హైద‌రాబాద్‌లోని అల్వాల్ ప‌రిధిలోని చిన్న‌రాయుని చెరువులో హైడ్రా సిబ్బంది గురువారం ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశారు. ఉద‌యాన్నే బుల్డోజ‌ర్లు, ఎక్స్‌క‌వేట‌ర్ల‌తో చేరుకున్న సిబ్బంది చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న భ‌వ‌నాల‌ను కూల్చివేశారు. ఆయా భ‌వ‌న నిర్మాణాల‌పై స్థానికులు కొంద‌రు చేసిన ఫిర్యాదు మేర‌కు ఈ దాడులు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తున్న‌ది.

Hydra:హైడ్రా సిబ్బంది కూల్చివేత‌ల సంద‌ర్భంగా బాధిత కుటుంబాల‌కు, హైడ్రా అధికారుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల బాధితులు త‌మ సామాన్లు కూడా తీసుకోవ‌డానికి స‌మ‌యం లేక ల‌బోదిబోమ‌న్నారు. అప్పులు చేసిన చిన్న‌పాటి వ్యాపారాలు చేసుకున్న వారు ల‌క్ష‌లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లి రోడ్డున ప‌డ్డామ‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *