Hydra: హైదరాబాద్ నగరం పరిధిలోని మాధాపూర్ అయ్యప్ప సొసైటీ పరిధిలో హైడ్రా అధికారులు, సిబ్బంది నిర్మాణాల కూల్చివేతకు ఆదివారం మళ్లీ శ్రీకారం చుట్టారు. ఓ భవనాన్ని అక్రమంగా నిర్మించారని, గత కొన్నాళ్లుగా హైడ్రా నోటీసులు ఇస్తున్నా, ఆ భవన యజమానికి స్పందించడం లేదని పేర్కొంటూ ఏకంగా బాహుబలి బుల్డోజర్ సాయంతో కూల్చివేతలను ప్రారంభించారు.
Hydra: ఇప్పటికే ఆ భవనం 90 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రోడ్డులో ప్రధాన రహదారికి పక్కనే అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ భవనం కూల్చివేతల విషయంపై నిన్నటి నుంచే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తున్నది.
Hydra: ఈ భవనం అక్రమ నిర్మాణమని జీహెచ్ఎంసీ తేల్చింది. ఈ మేరకు భవన యజమానులకు నిరుడే నోటీసులను ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు కూడా దానిని అక్రమమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ భవనాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో అందరూ ఊహించినట్టుగానే ఆదివారం కూల్చివేత చేపట్టారు. భవనం మెయిర్ రోడ్డుకు పక్కనే ఉండటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించి కూల్చివేతలు చేపట్టారు.