Malavika Nair: దశాబ్దం క్రితం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా నాయర్. ఆ సినిమాతో పాటు ఆ తర్వాత సంవత్సరమే వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ హీరోయిన్ గానే కాదు… పాత్ర నచ్చితే నిడివితో సంబంధం లేకుండా చిత్రాలను చేస్తోంది. ఇక మాతృసంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఎ.డి.’లో ఉత్తర గా నటించింది మాళవికా నాయర్. అలానే గత యేడాది ‘కృష్ణం ప్రణయ సఖీ’ మూవీతో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టి, చక్కని విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన ఓ సినిమాలో మాళవికా నాయర్ నటిస్తోంది. వైవిధ్యమైన పాత్రల కోసం పరితపించే మాళివికా నాయర్ కోరిక నెరవేరాలని కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం.