Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు తిరగబడి దాడి చేశారు. కార్డెన్ సెర్చ్ చేసేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులపై దాడి చేసి, ఏకంగా వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో ఆ ఊరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించడానికి వచ్చారు. వారు చేపట్టిన కార్డెన్ సెర్చ్‌లో పలు ఇండ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికింది. ఈ సమయంలో ఆ కలప దుంగలు, ఫర్నిచర్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో గ్రామస్థులు తిరగబడ్డారు. కలపను తమ ఇండ్ల నుంచి తీసుకెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
Adilabad: కార్డెన్ సెర్చ్ చేస్తున్న అటవీశాఖ బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌పై కొందరు గ్రామస్థులు దాడి చేయడంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. అటవీశాఖకు చెందిన ఓ వాహనంపై వారు దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ విషయంలో స్థానిక పోలీసులకు తెలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, అటవీ అధికారులపై దాడి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.