Hyderabad: వర్గీకరణపై హైకోర్టుకు మాలమహానాడు

Hyderabad : వర్గీకరణపై మాలమహానాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ ఆధారంగా జరిగిందని పిటిషన్ లో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేశారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు ఆధారంగా డేటాను సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. కేసు విచారణకు స్వీకరించే సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ రేణుకా యార ధర్మాసనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరగలేదా.? అని ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు డీవీ సీతారాం మూర్తి తన వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వెనుకబాటుతనాన్ని నిర్ణయించడానికి డేటా చాలా కీలకమని పేర్కొన్నారు. పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరిచింది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కు 11వేల పిటేషన్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *