Hyderabad: హైదరాబాద్‌లో మంగళవారం నాడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి సహా నగరంలోని అనేక ప్రాంతాలు వర్షానికి తడిసిముద్దయ్యాయి.
ఈ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నెమ్మదించడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. నడకదారులకూ, బస్ ప్రయాణికులకూ రాకపోకలలో తీవ్ర అసౌకర్యం కలిగింది.
ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్‌ఎసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి నిలువలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సకాలంలో స్పందిస్తూ చర్యలు తీసుకుంటోంది.
హవామాన శాఖ నివేదిక ప్రకారం నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరం లేనప్పుడైతే ఇళ్లలోనే ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

