Hyderabad: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయం వరకు ఉన్న ఫ్లైఓవర్ పేరును మార్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా పిలవబడుతున్న ఈ వంతెనను ఇకపై “తెలంగాణ తల్లి ఫ్లైఓవర్”గా మారుస్తున్నారు. ఈ మేరకు సంబంధిత సిఫార్సును కార్పొరేషన్‌కు పంపాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.

బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్పై చర్చించి, వాటికి ఆమోదం లభించింది. అందులో ఫ్లైఓవర్ పేరు మార్పు కూడా ఒక ముఖ్య అంశం.

ఈ నిర్ణయంతో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే మరో గుర్తింపు ఏర్పడనుంది. ఇప్పటికే పలు ప్రదేశాలు, భవనాలు, ప్రాజెక్టులు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా పేరు మార్చుకున్నాయి. తాజాగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరుతో ఈ వంతెన ప్రజల ముందుకు రానుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *