Hyderabad: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో మొదటి రోజు విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో ప్రత్యక్షంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి మరియు వారి న్యాయవాదులు హాజరయ్యారు.
ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు వారి న్యాయవాదులు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషన్ దారుల మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదుల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ విచారణను నిర్వాహించగా, అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా పరంగా పలు ఆంక్షలు అమలు చేశారు.