Hyderabad

Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి 2 వరకు నడవనున్న ట్రైన్

Hyderabad: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను పొడిగించింది. సెప్టెంబర్ 6వ తేదీన మెట్రో రైళ్లు రాత్రి 2 గంటల వరకు నడుస్తాయని అధికారులు తెలిపారు.

సాధారణంగా ఉదయం 6 గంటలకు మొదలయ్యే మెట్రో సేవలు, ఈ రోజు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు బయలుదేరి, 2 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంది.

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కారణంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని, పోలీసులను, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మరికొన్ని స్టేషన్లలో కూడా అదనపు టికెట్ కౌంటర్లను తెరవనున్నారు. ప్రయాణికులు మెట్రో సిబ్బందికి సహకరించి, క్రమశిక్షణతో వ్యవహరించాలని అధికారులు కోరారు.

మెట్రోతో పాటు, తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను, దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను నిమజ్జనం రోజున నడుపనున్నాయి. నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకుని గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించాలని అధికారులు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *