Hyderabad: హైదరాబాద్‌లోని మేధా స్కూల్‌పై అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. విద్యాశాఖ అత్యవసరంగా ఆ స్కూల్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
ఇటీవల స్కూల్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో దాదాపు పది కిలోల మత్తుమందు స్వాధీనం కావడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. విచారణలో ఆ స్కూల్ భవనంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారు చేసి, వాటిని విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో విద్యాశాఖ సీరియస్‌గా వ్యవహరించింది.
ఈ ఘటనతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మేధా స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని మరో స్కూల్‌లలో చేర్పించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
ఇక, ఈ అక్రమ కార్యకలాపాలపై గట్టి చర్యల భాగంగా ఈగల్ టీం ఇప్పటికే మేధా స్కూల్‌ను సీజ్ చేసింది. డ్రగ్ మాఫియాతో సంబంధాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.