Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజుకో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లలో ఈ ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ సమయంలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి పూట ఈ మంటలతో స్థానికులు భీతిల్లిపోయారు. ప్రాణనష్టం జరగకున్నా భారీ ఆస్తినష్టం సంభవించింది.
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని కంచుకోట టిఫిన్ సెంటర్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ లోగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. రెండు బైక్లు కాలిపోయాయి. ఇతర విలువైన సామగ్రి కాలిబూడిదైంది. భారీ ఆస్తినష్టం జరిగిందని హోటల్ యజమాని తెలిపారు.
Hyderabad: ఈ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భవనంలోని షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? గ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయా? మరే కారణమైనా అయి ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయా కోణాల్లోనే నిర్వాహకులను విచారిస్తున్నారు.