Hyderabad: మద్యం వాహనంలో అగ్నిప్రమాదం.. మందు కోసం ఎగబడ్డ జనం

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని హబ్సిగూడ వద్ద మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో ఆకస్మికంగా అగ్నిప్రమాదం సంభవించింది. వాహనంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపేశాడు. స్థానికులు సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనలో పలు మద్యం సీసాలు పాక్షికంగా కాలిపోయాయి. మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాటిని సేకరించడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ సమాచారం తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఒక్కసారిగా జనాలు గుమికూడడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *