Hyderabad: హైదరాబాద్ గాజులరామారం పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హబీబ్ బస్తీ, బాలయ్యనగర్, గాలిపోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీ, రాజు రాజేంద్రనగర్ ప్రాంతాల్లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
ఈ చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా హబీబ్ బస్తీలో ప్రజలు రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల రాళ్లదాడిలో జేసీబీ యంత్రాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
గందరగోళం పెరగకుండా పోలీసులు జోక్యం చేసుకుని హబీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.