Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. ఓ మైనర్‌పై ఐదురుగు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. డ్రగ్స్, గాంజా కల్చర్ విచ్చలవిడిగా పాకుతుండటం కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి దారితీస్తున్నాయి.
Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన ఆ బాలిక తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad: మైనర్‌పై సామూహిక లైంగికదాడికి పాల్పడిన దుండుగులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి సామూహికంగా పశుప్రవృత్తితో లైంగికదాడి చేసిన ఐదుగురు దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను మానవతావాదులు కోరుతున్నారు. నగరంలో డ్రగ్స్, గాంజా మాఫియాను పూర్తిగా నిర్మూలిస్తేనే ఇలాంటి అమానవీయ ఘటనలను నివారించవచ్చని సూచిస్తున్నారు.