Crime News: హైదరాబాద్‌లో ఓ కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కిషన్‌బాగ్‌లో నివసించే మహమూద్ (45)కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్యతో కలిసే జీవిస్తున్న మహమూద్, ఇటీవల షహజాదీ బేగాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. దింతో కుటుంబంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇద్దరు భార్యల మధ్య మాటల యుద్ధం జరుగుతుండేది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారి తీసేవి.
ఇటీవల సోమవారం రాత్రి కూడా ఇద్దరు భార్యలు ఓ విషయం మీద తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మహమూద్ తల్లి మహమూద్‌బీ (65) మధ్యలోకి వెళ్లి వాళ్లను శాంతింపజేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో ఇద్దరు కోడళ్లు ఒకరినొకరు తోసుకోవడంతో, ఆమె అనుకోకుండా తోపులాటలోనే కిందపడిపోయారు.
ఇది కూడా చదవండి: Gujarat: గుజరాత్‌లో నదిలో కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు
ఈ ఘటనతో ఆమె బాగా గాయపడింది. తీవ్ర భయంతో ఆమెకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహమూద్‌బీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సాధారణంగా చూపే కుటుంబ కలహాలు కూడా కొన్ని సార్లు ఇలా పెనుదుర్గటనలకు దారితీయవచ్చు అనే దానికి ఇది ఉదాహరణ.