Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక మలుపునకు తిరుగుతున్నది. మాజీ ఎమ్మెల్యే సోదరుడైన డాక్టర్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కేసు వ్యవహారం చాంతాడంత ఉన్నట్టు తేలుతున్నది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 30 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: తాజాగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడైన విశాఖ కేజీహెచ్ అనస్తీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్, ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతతో కలిసి వీరు కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.