Hyderabad: హైదరాబాద్‌లోని ప్రముఖ మహీంద్రా యూనివర్సిటీలో మాదకద్రవ్యాల వినియోగం బయటపడటం తీవ్ర సంచలనం రేపింది. ఐదుగురు విద్యార్థులు డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు.
ఎలా బయటపడింది?
మల్నాడు రెస్టారెంట్ యజమాని అందించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు యూనివర్సిటీలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.5 కిలోల గంజాయి, 47 గ్రాముల ‘ఓజీ వీడ్’ స్వాధీనం అయ్యాయి. ఈ మాదకద్రవ్యాలను ఢిల్లీ నుంచి శ్రీమారుతి కొరియర్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
అంతర్జాతీయ లింకులు కూడా బయటపడ్డాయి
గతంలో విద్యార్థులు నిక్ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి, నగరంలోని పబ్‌లలో పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం 50 మంది విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు, డ్రగ్స్‌కు బానిసైన వారికి కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.