Hyderabad: హైదరాబాద్ మహానగరం గజగజ వణుకుతున్నది. రాత్రిపూట మరింతగా జంకుతున్నది. ఎందుకనుకుంటున్నారా? చలికాలం కదూ.. అందుకే వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. రాత్రి అయిందంటే చాలు దుప్పట్లు బిగుసుకు కప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మంచు కురుస్తున్నది. పొగమంచుతో వాహనాల రాకపోకలకూ ఇబ్బంది ఏర్పడుతున్నది. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్‌చెరువు, బేగంపేట, హయత్‌నగర్, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం పూట చలి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. గడిచిన మూడు రోజుల నుంచి ఈ చలి ప్రభావం పెరిగిందని నగర వాసులు తెలిపారు.
Hyderabad: సోమవారం కూడా నగరంలోని పలుచోట్ల పొగమంచు వ్యాపించింది. ఆదివారం రాత్రి కూడా విపరీతంగా చలి ప్రభావం ఏర్పడిందని పలువురు నగరవాసులు తెలిపారు. దీంతో కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో స్వెట్టర్లు, ఇతర చలి నుంచి రక్షణ పొందే ఉపకరణాల అమ్మకాలు కూడా పెరిగాయి.