IND vs AUS: భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్-ఎ జట్టుతో ముగిసిన అనధికార టెస్టులో ఓపెనర్‌గా రాణించిన నాథన్ మెక్‌స్వీనీకి ఆసీస్ సెలక్టర్లు అవకాశమిచ్చారు. పెర్త్‌లో నవంబరు 22న ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో అతడికి వార్నర్ ప్లేస్ లో చోటు దక్కింది.
మెక్ స్వీనీ.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆసీస్ సెలక్టర్లు అవకాశమిచ్చారు. మెక్‌స్వీనీ భారత్-ఎతో తొలి అనధికార టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 39, 88 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో అతను నిలకడగా రాణించాడు. దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ రిటైరయ్యాక ఉస్మాన్ ఖవాజాకు తోడుగా సరైన ఓపెనర్ లేక ఆసీస్ ఇబ్బంది పడుతోంది. స్టీవ్ స్మిత్ కొంత కాలం ఓపెనింగ్ చేసినా రాణించలేకపోయాడు. భారత్‌తో సిరీస్‌కు మార్కస్ హారిస్, సామ్ కొన్‌స్టాస్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ.. మెక్‌స్వీనీకే సెలక్టర్లు ఓటేశారు.
ఇది కూడా చదవండి: Team India: గెలుపు ముంగిట టీమిండియా బొక్కబోర్లా
IND vs AUS: ఈ మ్యాచ్ కోసం ఎంపికైన 13 మందిలో మరో కొత్త ముఖం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారి టెస్టుల్లో అవకాశం దక్కింది. అలెక్స్ కేరీకి తోడుగా ఇంగ్లిస్‌ను ప్రత్యామ్నాయ కీపర్‌గా ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా భారత్, ఆసీస్ అయిదు టెస్టుల్లో తలపడతాయి.
టీమిండియాతో తలపడే తొలి టెస్టు కోసం ఆసీస్ సెలక్టర్లు కెప్టెన్ కమిన్స్ ఖవాజా, మెక్‌స్వీనీ, హెడ్, స్టీవ్ స్మిత్, లబుషేన్, కేరీ, మిచెల్ మార్ష్, ఇంగ్లిస్, లైయన్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్ ను ఎంపిక చేశారు.