Hyderabad:

Hyderabad: అపార్ట్‌మెంట్‌లో ఇరుక్కున్న బాలుడి మృతి

Hyderabad: హైద‌రాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇరుక్కున్న బాలుడు అర్ణ‌వ్ (6) ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శుక్ర‌వారం జ‌రిగిన ఘ‌ట‌నలో ఆరేండ్ల బాలుడు తీవ్రగాయాల‌కు గుర‌య్యాడు. మాస‌బ్‌ట్యాంకు ప‌రిధిలోని శాంతిన‌గ‌ర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో బాలుడు ఇరుక్కున్న‌ ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. సంఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది బాలుడిని బ‌య‌ట‌కు తీసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Hyderabad: సాంకేతిక‌లోపం కార‌ణంగా ఆ బాలుడు అర్ణ‌వ్ లిఫ్ట్ మ‌ధ్య‌లో ఇరుకున్న‌ట్టు నిర్ధారించారు. నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, చికిత్స పొందుతూ ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 22)న మృతి చెందిన‌ట్టు ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. నిన్న‌టి నుంచి బాలుడికి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించిన‌ట్టు తెలిపారు. చికిత్స పొందుతూనే శ్వాస విడిచాడ‌ని చెప్పారు.

Hyderabad: బాలుడు గ్రౌండ్ ఫ్లోర్‌, ఫ‌స్ట్‌ఫ్లోర్ మ‌ధ్య‌లో ఇరుక్కోవ‌డంతో పొట్ట‌లో, వెన్నులో తీవ్ర‌గాయాలయ్యాయి. లిఫ్ట్‌కు, గోడ‌కు మ‌ధ్య‌న బాలుడు చిక్కుకోవ‌డంతో అత‌డిపై తీవ్ర ఒత్తిడి ప‌డిన‌ట్టు వైద్యులు తెలిపారు. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను బ‌ట్టి స‌ర్జ‌రీ చేసి, వైద్య చికిత్స‌లు అంద‌జేసినా బాలుడి ప్రాణాలు ద‌క్క‌లేద‌ని తెలిపారు. దీంతో బాలుడి మృత‌దేహాన్ని ఉస్మానియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *