Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు పెద్దఎత్తున కలకలం రేపుతోంది. నవజాత శిశువులను గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠా సభ్యులపై రాచకొండ పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.
దర్యాప్తులో కీలక ముందడుగు
రాచకొండ పోలీసుల ప్రత్యేక బృందం గుజరాత్‌కు వెళ్లి విచారణ కొనసాగిస్తోంది.ప్రధాన నిందితురాలు వందన ముఠాను పట్టుకునేందుకు గుజరాత్‌లో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, పిల్లలను కొనుగోలు చేసిన నలుగురు దంపతులను కూడా నిందితులుగా చేర్చారు.
ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.