Revanth Reddy: హైదరాబాద్‌ను ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా తీర్చిదిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలజిక్స్ (ICHOR BIOLOGICS) కొత్త యూనిట్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
జీనోమ్ వ్యాలీ ఘనత
కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదేనని సీఎం ప్రశంసించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 33 శాతం, బల్క్ డ్రగ్స్‌లో 43 శాతం హైదరాబాద్ నుంచే తయారవుతున్నాయని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: Satya Kumar: జగన్ ఎక్కడికెళ్లినా కొట్లాటలు, రాళ్ల దాడులు,
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ కృషి
ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలు కొనసాగుతున్నాయని, తాము మరింత సరళమైన విధానాలతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
- ఇప్పటివరకు ₹3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు వెల్లడించారు.
- రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను డేటా సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.
- ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు, అధునాతన సాంకేతికతను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
భవిష్యత్ లక్ష్యం
రాబోయే పది సంవత్సరాల్లో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్యం సాధించడానికి జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని కోరారు.

