హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళా దారుణ హత్య జరిగింది. దీప్తి శ్రీనగర్ లోని సీబబీఆర్ ఎస్టేట్స్ ప్లాట్ నెంబర్ 110లో నివసిస్తుంది స్పందన. ఇంటిలోకి కొందరు దుర్మార్గులు దూరి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన.స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఉదయం 10 నుండి 11 గంటల మధ్య హత్య జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
కాగా, కొద్ది రోజులుగా భార్య భర్త ల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరువురు విడాకుల కోసం కోర్టు ను ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నటు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.