Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు అరగంటసేపు మురాయించింది. నగరం వ్యాప్తంగా మెట్రో రైళ్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎక్కడికక్కడ మెట్రో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపు 30 నిమిషాలుగా మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు ఈ పరిణామంతో అవస్థ పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్- మియాపూర్ రూట్లలో పరుగులు తీసే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో కదలకపోవడంతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్లాట్ఫారంలో వేల మంది జనం ట్రైలర్ రాక కోసం ఎదురుచూపులు చూశారు. దీంతో వస్తున్నాను గురై చాలామంది వెలు తిరిగారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆఫీసులకు చేరుకున్నారు. కాగా మెట్రో రైల్ సాంకేతిక లోపం పై అధికారులు ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు.

