Ayyappan Swamy: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో అధికారుల వైఖరిపై అయ్యప్ప మాలధారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిరసనతో ఆ డిపో మేనేజర్ దిగొచ్చి, చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీనిపై అయ్యప్ప మాలధారులు పెద్ద ఎత్తున తరలివచ్చి డిపో అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. అయ్యప్ప స్వామిపై అపచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ayyappan Swamy: ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లో చేరేప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తన్నారు. ఈ సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అయిన నాగరాజు అయ్యప్ప మాలధారణలో ఉన్నాడు. తాను అయ్యప్ప దీక్షలో ఉన్నానని, డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయొద్దని నాగరాజు ఆ అధికారులను కోరారు. అయినా వినిపించుకోకుండా డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందేనని, నాగరాజును కూడా ఇతరులతోపాటు పరీక్ష జరిపారు.
Ayyappan Swamy: ఈ విషయం తెలిసిన తొర్రూరులోని అయ్యప్ప స్వామి భక్తిమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రోడ్డుపైకి వచ్చి అయ్యప్ప మాలధారులంతా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆర్టీసీ డిపో మేనేజర్ దిగొచ్చి అయ్యప్ప మాలధారుల ఎదుట క్షమాపణ చెప్పారు. అయ్యప్ప మాలధారులు ఆందోళనను విరమించారు.