హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్టువేర్ ఉద్యోగులు.
వీరు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. పెళ్లైన నెల రోజుల నుంచే రాఘవేందర్ రెడ్డి భార్యను వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని, జీతం తన బ్యాంకులోనే వేయాలని ఆయన వేధించాడు. పుట్టింటి నుంచి భూమి రాయించుకొని రావాలని వేధించాడు.
Jఇరువురి మధ్య తరచూ గొడవలు చెలరేగడంతో గురువారం రాత్రి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

