Nalgonda: భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారి తీసింది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఫ్యామిలీని నడుపుతున్న టైంలో.. ఆ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.. పెద్దలు నిర్ణయించిన పెళ్లే చేసుకున్నా… అనుమానం మాత్రం పెనుభూతంగా మారింది అతడికి… అంతే, ఇంకేముంది ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు.. వీడి అనుమానానికి గల కారణాలు ఏంటీ..??
భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, మాదిమాణిక్యంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల నరసకుమారికి అదే గ్రామానికి చెందిన బాల సైదులుతో వివాహం జరిగింది.
సైదులు భార్యపై అనుమానం పెంచుకొని ఇంట్లో నిద్రిస్తుండగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.