Ram Pothineni: మాస్ హీరో రామ్ పోతినేని మళ్లీ తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.రామ్ ఈసారి P మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన లుక్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నాన్ స్టాప్ గా సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
Also Read: RC16: RC16 టైటిల్ అదే.. ముహూర్తం ఖరారు?
Ram Pothineni: ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసి, రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్లిన యూనిట్ అక్కడ భారీగా షూటింగ్ నిర్వహించింది. అక్కడ మొత్తం 34 రోజులు పాటు షెడ్యూల్ జరిగింది. అక్కడ ప్రకృతి అందాల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.నాన్ స్టాప్‌గా జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, భారీ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన డైలాగ్ సీన్స్ చిత్రీకరించారు.
యూనిట్ డెడికేషన్‌తో రాత్రి పగలు షూటింగ్ నిర్వహించడం విశేషం. ఈ లవ్ సినిమాలో యాక్షన్ టచ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్‌గా భగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుండగా, ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.