Polycystic: పాలిసిస్టిక్ అనేది మూత్రపిండాలలో చిన్న కణితులు తలెత్తినప్పుడు వచ్చే ఒక వ్యాధి. దీనివల్ల మూత్రపిండాల మొత్తం నిర్మాణం మారడం ప్రారంభమవుతుంది. కాకపోతే మూత్రపిండాల్లో ఏర్పడేవి క్యాన్సర్ కణితులు కావు. కానీ ఈ కణితులు నీరు వంటి పదార్ధంతో నిండి ఉంటాయి. ఇది క్రమంగా ఉబ్బుతుంది, మూత్రపిండాల లోపల ఖాళీలను చుట్టుముడుతుంది. మూత్రపిండాల వ్యాధి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
క్రమంగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి పుట్టుకతో వస్తుంది. పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం వంశపారంపర్యం. అంటే పిల్లల తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి ఆలస్యంగా తెలుస్తుంది. దీంతో సరైన చికిత్స అందించలేరు. తల్లిదండ్రులకు ఈ వ్యాధి ఉంటే బిడ్డను కనడానికి ముందు వైద్యుల సలహాతో ముందుకు సాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read: Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినండి
Polycystic: ఈ విధంగా నవజాత శిశువును ఈ వ్యాధి నుండి రక్షించవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారి పిల్లలకు వారసత్వంగా వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లో నీరు తీసుకోవడం ద్వారా ఆమె పిండాన్ని పరీక్షించవచ్చు. దీని ద్వారా శిశువు ఈ జన్యువులతో పుడుతుందో లేదో తెలుసు కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే ముందుగానే జాగ్రత్తగా ఆరోగ్య నియమాలు పాలించాలి. అంతే కాకుండగా మంచి ఆరోగ్యకమైన ఫుడ్స్ తినాలని నిపుణులు అంటున్నారు.