Pregnancy

Pregnancy: కిట్ లేకుండా అప్పట్లో ప్రెగ్నెన్సీని ఎలా గుర్తించేవారు?

Pregnancy: ఈ రోజుల్లో మహిళలు వివాహం తర్వాత ఋతుస్రావం తప్పితే వెంటనే వారు వెంటనే గర్భధారణ కిట్ ఉపయోగించి ప్రెగ్నెన్సీ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కిట్లు లేని రోజుల్లో మహిళలు తమ గర్భధారణను ఎలా పరీక్షించుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పురాతన కాలంలో, మహిళలు సహజ పద్ధతులు, శారీరక లక్షణాల ద్వారా గర్భధారణను గుర్తించేవారు.

పురాతన కాలంలో, పల్స్ చెక్ చేయడం ద్వారా గర్భధారణను గుర్తించేవారు. ఒక స్త్రీ గర్భవతిగా ఉందో లేదో ఆమె మణికట్టును పట్టుకుని ఆమె నాడి చెక్ చేయడం ద్వారా వారు తెలుసుకునేవారు. పురాతన కాలంలో మహిళలు తమ శరీరంలోని మార్పుల ద్వారా గర్భధారణను గుర్తించేవారు. వికారం, వాంతులు వంటి లక్షణాల ద్వారా గర్భధారణకు ముందస్తు సూచనలుగా భావించేవారు.

Also Read: Half Day Schools: పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచే ఒంటిపూట బ‌డులు

Pregnancy: గర్భం దాల్చిన తొలినాళ్లలో అలసట, బలహీనంగా అనిపించడం కూడా గర్భధారణకు సంకేతంగా భావించేవారు. వాపు, సున్నితత్వం, రొమ్ముల రంగులో మార్పులు గర్భధారణ లక్షణాలుగా పరిగణించేవారు. గర్భం యొక్క అతి ముఖ్యమైన ప్రారంభ లక్షణాలలో ఒకటి ఋతుస్రావం లేకపోవడం. నేటికీ, ఋతుస్రావం తప్పిన తర్వాత గర్భధారణ పరీక్షలు చేస్తారు.

ఇది ప్రెగ్నెన్సీ కిట్స్ అందుబాటులో లేనప్పటి నుంచి పాతకాలం నుంచీ వాడుతున్న ఒక మార్గం. ఒక గిన్నెలో చెంచాడు పంచదార తీసుకుని అంతే మూత్రాన్ని కలపాలి. పంచదార ముద్దగా మారితే ప్రెగ్నెన్సీ నిర్ధరణ అయినట్లే. ఎందుకంటే మూత్రంలో ఉండే హెచ్‌సీజీ హార్మోన్ పంచదారను నీటిలో సరిగ్గా కరగనివ్వదు. అలా కాకుండా పంచదార వేగంగా కరిగిపోతే ప్రెగ్నెన్సీ లేదని అర్థం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *