Horoscope

Horoscope: నేటి రాశిఫలాలు: అదృష్టం ఎవరిని వరించింది?

Horoscope: ఆగస్టు 15, 2025, శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి జరగబోయే శుభ, అశుభ ఫలితాలను జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. ఈ రోజు రాశిఫలాల ప్రకారం, కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కనిపించగా, మరికొందరికి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

మేషం:
ఈ రాశి వారికి ఆర్థిక వివాదాలు, సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. బంధుమిత్రులకు సహాయం చేయగలగడం సంతోషాన్నిస్తుంది.

వృషభం:
వృషభ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా, మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి.

మిథునం:
ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతభత్యాల పెరుగుదల ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం:
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

సింహం:
ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. అదనపు ఆదాయం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది.

కన్య:
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కానీ వృథా ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. బంధుమిత్రులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి.

తుల:
ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పనులు, వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

వృశ్చికం:
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

ధనుస్సు:
ఉద్యోగంలో మీ సలహాలు అధికారులకు ఉపయోగపడతాయి. ఆదాయం పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం:
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

ALSO READ  Varuthini Ekadashi 2025: వరుథిని ఏకాదశి నాడు ఈ పనులు చేయకండి.. లేకుంటే పేదరికంలో కూరుకుపోతారు

కుంభం:
ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ఉద్యోగ విషయంలో శుభవార్త అందుతుంది. ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది.

మీనం:
ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *