Horoscope: ఈ రోజు గ్రహాల స్థితిగతులు మొత్తం 12 రాశుల వారిపైనా తమ ప్రభావాన్ని చూపుతాయి. మేష రాశి వారికి ఈ రోజు కొత్త ప్రయత్నాలకు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఇంటా బయటా కొత్త బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. ధన లాభం పెరుగుతుంది.
మేష రాశి: ఈ రోజు మీ ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు అనువైన సమయం. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి.
వృషభ రాశి: ఈ రోజు పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటు ఉండదు కానీ డబ్బు చేతికి రావడంలో ఆలస్యం కావచ్చు. మీరు సహాయం చేసినవారు ముఖం చాటేస్తారు. కుటుంబంలో, పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిథున రాశి: ఆర్థికంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. అదనపు ఆదాయ వనరులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. పనిలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పనిభారం ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి: ఆదాయ ప్రయత్నాలకు కొంత సమయం పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఆర్థికంగా బాగానే ఉన్నా, పనులు ఆలస్యం అవుతాయి. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దగ్గరి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య రాశి: ఉద్యోగం, వివాహ ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు మెచ్చుకోబడుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
తుల రాశి: ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు లాభాలను తెస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా ఉండదు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఎవరికీ డబ్బు విషయంలో హామీలు ఇవ్వొద్దు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి.
ధనుస్సు రాశి: ఈ రోజు మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
మకర రాశి: ఈ రోజు మీ కోరికలు నెరవేరుతాయి. అదనపు ఆదాయ వనరుల నుంచి శుభవార్తలు వింటారు. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు.
కుంభ రాశి: మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. గృహం, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉంటారు.
మీన రాశి: ఈ రోజు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆగిపోయిన డబ్బు సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువ. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం సుఖంగా, సంతోషంగా సాగిపోతుంది.

